16716902607537667714

కేరళ గవర్నర్‌ అధికారాలకు చెక్ పెట్టిన పినరయి ప్రభత్వం!

కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌, సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య విభేదాల నేపథ్యంలో ఆయనను యూనివర్సిటీ ఛాన్సలర్‌ పదవి నుంచి తొలగించాలని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేరళ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది.

గవర్నర్ స్థానంలో నిపుణులైన విద్యావేత్తను రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ దీనిపై సంతకం చేస్తేనే అది అమలులోకి వస్తుంది.

కాగా, కేరళలోని తొమ్మిది యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌, ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లను రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో తొమ్మిది యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించారు.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow