శ్రీలంక లో ఏనాడూ లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది దీనికి ప్రజలు మరింత ఆగ్రహంతో అట్టుడికిపోతున్నారు. ప్రజలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దేశ అధ్యక్షుడు రాజపక్స అధికార నివాసం ముందు భారీ సంఖ్యలో నిరసన చేస్తున్న ప్రజలపైన ప్రధాని మహింద నివాస సమీపంలో ఆయన అనుచరులు దాడి చేసారు. నిరసన తెలుపుతున్న టెంట్లు, ప్లకార్డులను ధ్వంసం చేశారు దాడి చేశారు. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ఇంకా ఎన్నో రకాలుగా ప్రయోగించిన లాభం లేకపోయింది. ప్రజాగ్రహం మరింత తీవ్రం అవ్వడంతో ప్రధాని మహింద రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేసిన కొద్దిగంటల్లోనే పూర్వీకుల ఇంటికి నిరసన కారులు నిప్పు అంటించారు. సోమవారం జరిగిన ఆందోళనల్లో ఒక ఎంపీ సహా ఐదుగురు ప్రజలు మృతి చెందగా మరో 180 మంది గాయపడ్డారు.
ప్రజలు తీవ్ర నిరసనలు తెలుపుతూ శ్రీలంకలోని నిట్టంబువాలో ఒక ఎంపీ కారుని అడ్డగించారు. దీంతో అయన తన వద్ద ఉన్న తన రివాల్వర్ తో కాల్పులకు దిగాడు ఈ ఘటనలో ఒక నిరసన కారుడు చనిపోగా మరొకరు తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన తరవాత ఆందోళన కారులు మరింత రెచ్చిపోయారు. ఎంపీ ఇంటి పైన దాడికి సిద్ధం అయ్యారు ప్రజలు దీంతో ఎంపీ దగ్గరలోని భవనంలో తలదాచుకున్నారు. స్థానికులు వేలాదిగా జనాలు భవనాన్ని చుట్టుమట్టి లోనికి చొచ్చుకొస్తుడంతో భయాందళన చెందిన ఎంపీ రివాల్వర్ తో తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఈ ఘటన తర్వాత పోలీసుల పైన కూడా సాధారణ ప్రజలకు దాడి చెయ్యడంతో కొందరి పోలీస్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి.