పంజాబ్ లో యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. పంజాబ్ పాటియాలాలోని రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా లో ఒకేసారి 60 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ యూనివర్సిటీని అధికారులు కంటైన్‌జోన్‌లో ఉంచారు. వైరస్ సోకిన విద్యార్థులందరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన అందరిని ఐసోలేషన్ లో ఉంచారు. దీంతో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 10వ తేదీలోగా మొత్తం హాస్టళ్లను ఖాళీ చేయాలనీ అధికారులు కోరారు. గత కొద్దీ రోజులుగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి.
కొన్ని రాష్ట్రాలు ఎప్పటికి కరోనా నిబంధనలు మరియు జారిమానా లు విధిస్తున్నాయి. వారం రోజుల ముందర ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలికల స్కూల్ లో 16 మంది విద్యార్థులకు కరోనా బారినపడ్డారు. గతంలో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని పాఠశాలల్లో భారీగా కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొవిడ్ కేసుల సంఖ్య 170కి చేరింది అయితే, అధికారులు క్యాంపస్‌ను మూసివేయకుండానే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం, యంత్రాగం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు అని అధికారులు తెలియచేసారు.