భారత్-రష్యా మధ్య స్నేహ బంధానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా 2 దేశాల సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఢిల్లీలో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో భారత్ లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘స్నేహాన్ని మించింది లేదు’.. అని భారత్ లో ప్రాచుర్యం పొందిన సామెత ఒకటి ఉంది. భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉన్న విశ్వాసం, స్నేహపూర్వక సంబంధాలకు ఇది అతికినట్లు సరిపోతుంది’. అని వ్యాఖ్యానించారు. అయితే కరోనాతో నిలిచిన ఈ వేడుకలు తాజాగా పునఃప్రారంభమయ్యాయి.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs