కరోనా దెబ్బతో సాఫ్ట్ వేర్, ఇతర రంగాల్లోని కార్యాలయాలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకొనే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే . కరోనా ప్రారంభం నుంచి ఇంటి నుంచి పని చేస్తూ రెండేళ్లుగా కొనసాగుతుంది. ఇంటి వద్దనే ఉంటూ తమ పనులు చేసుకుంటున్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గి రోజు ప్రస్తుతం 2,500 నుంచి 3వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ఆంక్షలను సైతం కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని పిలుస్తున్నాయి. గ్రామంలో టౌన్ లో ఉన్న ఉద్యోగులు పట్టణాలకు చేరుకొని తమ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.
ముంబైకి కంపెనీ కోడింగ్ లెర్నింగ్ స్టార్టప్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ‘వైట్‌హ్యాట్ జేఆర్’ కు చెందిన 800 మంది ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పని చెయ్యము అన్నందుకు రాజీనామా చేసారు. ఐఎన్‌సీ42 ఎక్స్ క్లూజివ్ వైట్‌హ్యాట్ జేఆర్ ను రెండేళ్ల క్రిందట ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ 2020లో 300 మిలియన్లకు కొనుగోలు చెయ్యగా దేశంలో కొవిడ్ తగ్గడంతో ఒక నెల వ్యవధిలో ఉద్యోగులందరూ ఆఫీస్ కు వచ్చి వర్క్ చెయ్యాలని కోరుతూ ఆ కంపెనీ సంస్థ ఈ మెయిల్ ద్వారా కోరింది. అయితే కార్యాలయాలకు వచ్చేందుకు
ఐటీ ఉద్యోగులు ఇష్టపడటం లేదు. ఇంటి నుంచే పని చేస్తాం అని చెప్తున్నారు. ఇంటి నుంచి పని చేస్తే ఖర్చులు తగ్గించుకోవడాన్కి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు.