అనకాపల్లి లో పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్త ని గొంతు కోసిన విషయం తెలిసందే. ఎందుకు ఇలా చేసింది ఏంటని పోలీస్ లు ప్రశ్నిస్తే ఈమె మాత్రం తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తాను వేరే అతని ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లాలోని పాడేరుకు గ్రానికి చెందిన రాము నాయుడు అనే వ్యక్తికి రావికమతం గ్రామానికి చెందిన ఓ యువతికి పెద్దలు ఈ ఏడాది మే 28న వివాహం చేయాలనీ ఫిక్స్ చేసారు. రామానాయుడు హైద్రాబాద్ లో పని చేస్తున్నాడు.
హైద్రాబాద్ నుండి తమ గ్రామం పాడేరు కు వచ్చాడు రామానాయుడు. దీంతో విషయం తెలుసుకున్న యువతీ రామానాయుడు ని బయటికి పోదాం అని పిలిచింది. యువకుడు కాబోయే భార్య అని నమ్మి బయటికి వెళ్ళాడు. గ్రామం చివర ఉన్న గుట్టపైకి తిసుకేలింది. కళ్ళు మూసుకో సర్స్రైజ్ ఇస్తా అంటూ సినిమా సన్నివేశం క్రీట్ చేసింది. రామనాయుడు కళ్లు మూసుకోగానే యువతీ తెచ్చుకొన్న కత్తితో రామానాయు గొంతు కోసింది. దీంతో తీవ్రగా గాయపడిన రాము ఎలాగో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వెంటనే రాముని ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం రామానాయుడు పరిస్థితి విషమంగా ఉంది.