వైయస్సార్ సున్నా వడ్డీ పథకం వరుసగా మూడో ఏడాది ఇవ్వనుంది జగన్ ప్రభుత్వం. ఈ సందర్భంగా జగన్ ముఖ్యమంత్రి జగన్ ఒంగోలులో నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పేదలక ప్రయోజనం చేసే ఈ సంక్షేమ పథకాలను రమూడో ఏడాది వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో రూ 1261 కోట్లు జమ చేస్తున్నాం అన్నారు .స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. వైయస్సార్ సున్నా వడ్డీ పధక లబ్ధిదారులు వారి వ్యాపారాల కు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వాటిని సందర్శించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు .
ప్రతిపక్ష పార్టీ టీడీపీ మరియు జనసేన పార్టీ ల పైన విమర్శలు చేసారు. జగన్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు రద్దు చేస్తామని టీడీపీ చెబుతుందని జగన్ ఆరోపించారు. అసలు పథకాలు రద్దు చేస్తే ప్రజలు ఒప్పుకొంటారా అని ఆయన ప్రశ్నించారు.పేదల కోసం పథకాలు అందిస్తుంటే రద్దు చేయడం సమంజసమా అని ఎల్లో పార్టీని, ఎల్లోమీడియాను దత్తపుత్రుడిని పవన్ నిలదీయాలని జగన్ అన్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు పేదల కోసం పనిచేయకుండా రామోజీరావు, ఏబీఎన్, టీవీ 5 కోసం పనిచేసాడు అని విమర్శలు చేసారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే మంత్రి పదవులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక ఎలా అవుతుందా అని ప్రశ్నించారు జగన్. చంద్రబాబు చేసినట్లు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అమెరికా అవుతుందని ఎల్లో మీడియా లో ప్రచారం చేస్తున్నారన్నారు.