తమిళనాడు లోని మధురై లో విషవాయువులు వెలువడి ముగ్గురు చనిపోయారు. మధురై కార్పొరేషన్ లో పరిధిలో 70 వ వార్డ్ లో మురుగు నీటి ట్యాంక్ రిపేర్ అయింది. దీంతో మురుగు నీరు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు నలుగురు ఎలక్ట్రిక్ మోటారు సాయంలో బయటకు తీసి పని ప్రారంభించారు. అయితే అదే సమయంలో లోపల శుభ్రం చేస్తున్న శరవణన్ విష వాయువు రావడంతో లోపల ఉండిపోయాడు. అతని కాపాడేందుకు తోడుగా వచ్చిన శివకుమార్ , లక్షణ్ ట్యాంక్ లోపలకు వెళ్లారు. వారు కూడా విష వాయువు లో చిక్కుకుని మృతి చెందారు. వెంటనే తోటి కార్మికులు అధికారులకు సమాచారం ఇచ్చాడు. అగ్ని మాపక సిబ్బంది వెంటనే చేరుకొని శివకుమార్ ని కాపాడారు. 108 వాహనం రాకపోవడంతో బైక్ మీద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వెళ్తున్న మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటన పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరైన భద్రత పరికరాలు ఇవ్వకుండా లోపలి పంపిచడం ఏంటని ఆందోళనకు దిగారు. ఈ ఘటన పైన జిల్లా కలెక్టర్ అనీష్ సెగర్ స్పందించారు ప్రమాదం పైన విచారణ చేపిస్తాం మృతులకు న్యాయం చేస్తాము అని హామీ ఇచ్చారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs