ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ ఎన్నికలకురెండేళ్లు మాత్రమే ఉండడంతో ఇటీవల జిల్లాలకు కొత్త అధ్యక్షులు నియమించారు. ఇందుకు కొన్ని జిల్లాలకు పాత వారిని తీసి కొత్త వారని నియమిస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ని తప్పించడం పైన పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజా గా కొత్తగా మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కిల్లి కృపారాణి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపైనా ఈమె స్పందించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలి బాధ్యతల నుంచి నన్ను తప్పించడంపై బాధ లేదు నేను ఎటువంటి పార్టీ కి వెళ్లడంలేదు వైసీపీ తోనే ఉంటాను అని పేర్కొన్నారు. నన్ను తప్పించడం పెద్ద బాధ్యతలను అప్పగించేందుకే కాబోలు అని సీఎం నిర్ణయంతీసుకున్నారు అని భావిస్తున్నా అని తెలిపారు. వైసీపీ పార్టీ కోసం సాధారణ కార్యకర్తగాచేస్తాను అన్నారు. తమ పార్టీలోని కొందరు తమ నేతలు వ్యక్తిగత విభేదాలను పార్టీపై రుద్దడం బాధాకరం అన్నారు . ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పనిచేస్తా అన్ని చెప్పుకొచ్చారు. వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం” అని తెలిపారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs