దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్ ప్రభూత్వం గ్రామా సచివాలయాలను తీసుకొచ్చి ప్రతి పంచాయతీ లో పెట్టిన విషయం తెలిసంద. దేశం వ్యాప్తంగా దీని పైన ప్రశంసలు వచ్చాయి. గ్రామా ప్రజలు అధికారుల చుట్టూ తిరగకుండా గ్రామంలోనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. గ్రామా సచివాలయాలకు మంచి స్పందన రావడంతో పొరుగు రాష్ట్రం తమిళ్ నాడు వ్యాప్తంగా గ్రామా సచివాలయాలను ఏర్పాటు చేయనుంది.
ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలనకు మరింత తోడు అయ్యేలా గ్రామ సచివాలయాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. తమిళ్ నాడు వ్యాప్తంగా ఈ ఏడాది లోనే 600 గ్రామ సచివాలయాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు ఉత్తమ పట్టణ పంచాయతీలకు ‘ఉత్తమర్ గాంధీ’అవార్డులను ఇస్తామన్నారు.తమ తండ్రి కరుణానిధి 1998లో సీఎంగా ఉన్నపుడు ఒక ఏడాదికి నాలుగుసార్లు గ్రామసభలు నిర్వహించాలని చట్టంతీసుకొచ్చినట్లు తెలిపారు. తమ ప్రభుత్వంలో ఈ ఏడాది నుంచి ఏడాదికి ఆరు సార్లు గ్రామసభలు నిర్వహిస్తాం అని పేర్కొన్నారు. ఇకపైన ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీ స్థానిక సంస్థల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.