ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులుఘాతుకానికి పాల్పడ్డారు. కొత్తూరు దగ్గర ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బస్సుకు నిప్పు పెట్టారు మావోయిస్టులు. ఒడిశా పట్టణం నుంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఆపి .. ప్రయాణికులను కిందికి దింపారు. తర్వాత బస్సుకు నిప్పు పెట్టారు. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిరు అందుకే నిప్పు పెట్టినట్టు సమాచారం . ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. మంటలు భారీగా వ్యాపించడం జాతీయ రహదారిపైనా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs