విజయవాడ లో ప్రభుత్వ ఆసుపత్రి లో యువతీ పైన గ్యాంగ్ రేప్ ఘటన మరవక ముందే మరో గ్యాంగ్ రేప్ గుంటూరు లో చోటు చేసుకుంది. యువతీ ని గ్యాంగ్ రేప్ చేసి అత్య చేసారు దుర్మార్గులు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్ల దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తిరుపతమ్మ (35) అనే మహిళ వ్యవసాయానికి నీరు ఇచ్చే పైపులు అద్దెకిస్తూ జీవనం కొనసాగుతుంది. ఆమె భర్త శ్రీనివాస్ ఏదో పని కోసం తిరుపతి వెళ్ళాడు. వేళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా బుధవారం నిన్న సాయంత్రం తిరుపతమ్మ ఆమె ఇంట్లో దుస్తులు కూడా లేకుండా మృతి చెంది ఉండడం గమనించారు. శరీరం పైన గాయాలు గోళ్లతో రక్కిన గాయాలు, నోటితో శరీరం పైన కొరికిన గాట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రాధమిక ఆధారాలను బట్టి ఈమెను తెలిసిన వాళ్లే రేప్ చేసి ఉంటారు అని అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో మద్యం సేవించిన బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారానికి పాల్పడి హత్యా చేసిన ఘటన నిందితుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు నాయకులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీస్ లు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs