కామాంధులకు మరో యువతీ బలైంది. ఎన్ని చట్టాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న అత్యాచారాలు ఆగడంలేదు. ఈ మధ్య ఇతర రాష్ట్రలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో అత్యాచార ఘటనలు ఎక్కువయ్యాయి. విజయవాడ ఆసుపత్రిలోనే బాలిక పైన గ్యాంగ్ రేప్ మరియు గుంటూరు లో వరుస అత్యాచార ఘటనలు ఈ మధ్య చోటు చేసుకున్నాయి. తాజాగా దళిత గర్భని మహిళా పైన గ్యాంగ్ రేప్ చేసారు దుర్మార్గులు. అదికుండా భర్తముందే ఈ దారుణానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన ఓ దళిత కుటుంబం కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంన్నారు. భర్త తా పీ మేస్త్రి పని చేస్తున్నాడు. భార్య కూలీకి వెళ్తూ ఉంటుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె నాలుగు నెలల గర్భిణి కాగా ఇంట్లో పనికి పొకుందా పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఉంటుంది. కొన్ని రోజుల ముందర పని కోసం తెలంగాణ లోని కోదాడ కు వెళ్లి అక్కడ పని చేసి రేపల్లే లోని రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు బస్సు రాకపోవడంతో స్టేషన్ లోనే ఉన్నారు. అర్ధరాత్రి సుమారు గం2 గంటల ప్రాంతం లో మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. నిద్ర పోతున్న భర్తను లేపి సమయమెంత అని అడిగి గొడవ కు దిగారు. చభర్తని కొట్టి అతని దగ్గర ఉన్న రూ.750 లాక్కున్నారు. గర్భిణి అయిన భార్య, భర్తను కొట్టవద్దంటూ వారిని అడ్డుకుంది. దీంతో భార్య పైన పడ్డారు ఆ ముగ్గురు వ్యక్తులు. భార్యను రక్షించుకోవాలన్న తపనతో ఏడుపు కేకలతో అక్కడ ఉన్నవాళ్లని వేడుకున్నాడు కానీ వాళ్లు స్పందించలేదు. అదే పరుగు తో పక్కనే ఉన్న ఆర్‌పీఎఫ్ స్టేషన్ వెళ్లి చూడగా అక్కడ ఎవరు స్పదించలేదు. స్టేషన్ బయట ఉన్న రిక్షా కార్మికులను సాయం చెయ్యమని అడ్డాగా వా వాళ్లు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు దారిచూపించి సాయం చెయ్యలేదు. దీంతో చాల దూరం లో ఉన్న పోలీస్ స్టేషన్ కు అలానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు స్పందించారు. అతడితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటనాస్థలికి వచ్చారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. గర్భణి అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు పిల్లల ముందరే ఆమె పైన అత్యాచారం చేసారు.
ఈ ఘటన పైన స్పందించిన మంత్రి మంత్రి మేరుగ నాగార్జున ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. ఇలాంటి ఘటనకు ప్రతిపక్షపార్టీ లే కారణం అంటూ చెప్పుకొచ్చారు. నింధితులను పట్టుకున్నట్లు స్థానిక ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ నిందితులకు గతంలో కేసు లు ఉన్నాయి అన్నారు. పట్టుబడ్డ నిందితులు విజయకృష్ణ (20), పాలుచురి నిఖిల్(25) కాగా మరో నిందితుడిని మైనర్. వారిపై 376, 394, 307 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశాం’’ అని ఎస్పీ పేర్కొన్నారు.