16716902607537667714

నెల్లూరు లో తిరుపతి రుయా తరహా ఘటన బైక్‌పై కుమారుడి మృతదేహం తరలింపు

ఆంధ్ర ప్రదేశ్ లో ఆసుపత్రి లో దారుణ పరిస్థితులు ఎదురుఅవుతున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రి లో అంబులెన్సు నిర్వహం ప్రైవేట్‌ అంబులెన్స్‌ల డిమాండ్‌ను తట్టుకోలేక వేచిచూసి చూసి కొడుకు శవాన్ని 90 కిలోమీటర్లు బైక్ మీద తీసుకెళ్లిన ఘటన మరవకముందే అలంటి దారుణ ఘటన మళ్ళి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లాలో సంగం అనే గ్రామంలో కనిగిరి రిజర్వాయర్‌లో ప్రమాదవాశాత్తు ఈశ్వర్‌, శ్రీరామ్‌ అనే చిన్నారులు నీట మునిగి మృతి చెందారు. ఇందులో శ్రీరామ్ తల్లి తండ్రులుతన కొడుకు శ్రీరామ్‌ ప్రాణాలతో ఉన్నాడు అని భావించి , స్థానికులు తో కలిసి సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే శ్రీరాం అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో శ్రీరామ్ మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు 108 అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేశారు. అయితే వైద్య నిబంధనల ప్రకారం మృతదేహాన్ని 108 అంబులెన్స్‌లో తరలించరాదని వారుచెప్పడంతో ఏమి చెయ్యాలో తెలియక ఆటోలో తీసుకుపోండి అంటూ అక్కడి వైద్య సిబ్బంది చెప్పి తేల్చేసారు. దీంతో ఆటో దగ్గరకు వెళ్లి అడ్డాగా తాము కూడా రాము అని తేల్చారు. ధోనితో ఏమి చెయ్యాలో తెలియక దిక్కు తోచని పరిస్థితిలో కొడుకు శవాన్ని తండ్రి బైక్ మీద ఊరికి తీసుకొచ్చాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow