ఆదివాసీ హక్కుల జయకేతనం.. గిరిజనుల చైతన్యదీప్తి కుమురం భీం
భారత బానిస సంకెళ్లు తెంచేందుకు, భావితరాలకు స్వేచ్ఛను అందించేందుకు, తెల్ల దొరల గుండెల్లో సింహ స్వప్నమై నిలచి, అలుపెరగని పోరాటం చేసి అమరుడైన అగ్గిపిడుగు , “ నెత్తురు మండే యువతకు ఆరాధ్యుడు, మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు, బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని హడలగొట్టిన వీరుడు అల్లూరి సీతారామరాజు. 1922 నుండి 1924 వరకూ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ మన్యం ప్రాంతంలో బ్రిటీష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల సాధన కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం గెరిల్లా యుద్ధం చేసి తెల్ల దొరల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప దేశభక్తుడు. ఆయన జీవితం ఎప్పటికీ మనకు స్ఫూర్తి దాయకం. ఒక భారతీయుడిగా, ఒక తెలుగు వాడిగా శ్రీ అల్లూరి సీతారామరాజు జరిపిన మన్యం పోరాటం భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం.
తెలంగాణ ల్లో కొమురం భీమ్ అక్టోబర్ 22, 1901న జన్మించాడు. తల్లిదండ్రులు కొమరం చిన్నూ మరియు సోంబారు దంపతులు. ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామం దగ్గర భీమ్ జన్మస్థలం. దేశంలో ఆదివాసీల హక్కుల కొరకు జరిగిన పోరాటాలు ఈయన చేసిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. కేవలం తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న శ్రీ అల్లూరి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో గౌరవించబడటం ఆ మహనీయునికి మనం అర్పించే ఘన నివాళి. భారత దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే ఒక మహోజ్వల శక్తి మన అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో గడగడలాడించి, 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు వదిలిన, ఆ మన్యం వీరుడి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిద్దాం.