శ్రీలంక లో తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు నెలలుగా ప్రధాని మహింద రాజపక్స ను రాజీనామా చెయ్యాలి అంటూ తీవ్ర నిరసనలు తెలియచేసారు. దీంతో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తలవంచక తప్పలేదు.
ఎట్టకేలకు ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దేశంలో ఎలాంటి పరిస్థితి కారణం దేశాధ్యక్షుడు గొటబాయ మహింద రాజపక్స, ఆయన సోదరుడు, ప్రధాని మహింద రాజపక్సనే బలమైన కారణమని శ్రీలంక ప్రజలు కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూవచ్చారు.
రాజీనామా చెయ్యాలి అంటూ రోడ్లపైకి వచ్చి ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. శ్రీలంక సైన్యం రంగంలోకి దిగి కట్టడి చేసినప్పటికీ శ్రీలంక ప్రజలు లెక్క చేయలేదు. అధ్యక్షుడు, ప్రధాని అధికార నివాసాలపై వారి బంధువుల పైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల ఆందోళనలు హింసాత్మక కూడా మారాయి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. నిరసనలు హోరెత్తించడంతో ఎట్టకేలకు ప్రధాని రాజపక్స రాజీనామా చేశారు.వీటిని కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా ముఖ్యంలో కొలంబోలో కర్ఫ్యూ కూడా విధించారు. చివరకు పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రధాని మహింద రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.