భారత్ లో ఆహార ధాన్యాల ధరలకు భారీగా పెరిగి ప్రజలు సతమతం అవుతుండడంతో కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుంది. గోధుమ పండించడంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న భరత్ గోధుమ ఎగుమతులను నిషేధం విధించింది. ఇప్పటికే ఎగుమతి కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్ పొందిన షిప్ మెంట్లకు పొందిన కొన్నిటికి మాత్రం అనుమతి ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
రష్యా – యుక్రెయిన్ మధ్య యుద్ధ కారణంగా ఆ దేశాల నుంచి ఇతర దేశాలకు గోధుమ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయంగా కొన్ని దేశాలు గోధుమ సరఫరాలపై భారత పైన ఆధారపడ్డారు. దీంతో దేశీయంగా గోధుమల ఒకేసారి భారీగా ధరలు పెరిగిపోయాయి. సుమారు 15-25 శాతం మేర పెరిగాయి. 14 ఏళ్ల లో ఎప్పడు ల్ని విధంగా గరిష్ఠానికి ధరలు చేరాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రధాన కారణం యుక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం కారణం అని చెప్తున్నారు. దీనికితోడు రవాణా చార్జీలు పెరిగిపోవడం, ఇథనాల్ తయారీలో గోధుమలను వినియోగించడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీంతో ధరలను అదుపు చేసేందుకు ఎగుమతులను నిన్న శుక్రవారం కేంద్రం నిషేదిస్తునట్లు ప్రకటించింది.