కేరళలో టమోటా ఫీవర్’ కలకలం రేపుతోంది. కేరళ సరిహద్దు ప్రాంతాలను ఈ కొత్త రకం జ్వరం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది కోయంబత్తూరు పట్టణంలో కొన్ని ఆస్పత్రుల్లో అర్థంగాని జ్వర లక్షణాలతో చాల మంది చిన్నారులు చేరడంతో ‘టమోటా ఫీవర్’ ఏమోనని ఆందోళనకు గురవుతున్నారు. కేరళ రాష్ట్రంలో ‘టమోటా ఫీవర్’ వైరల్‌జ్వరం వ్యాప్తి ఎక్కువగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త రకం వైరస్ ను అడ్డుకొనేలా ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ వైద్యులు అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి కేరళ నుంచి వచ్చే వాహనాలు, ప్రయాణికులకు పరీక్షలు చేస్తున్నారు. ఎలా వచ్చిన వారిలో కేరళ సరిహద్దు ప్రాంతమైన కోయంబత్తూర్ కార్పొరేషన్‌లో టమోటా ఫీవర్ లక్షణాలతో 15 మంది చిన్నారులు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
టమోటా ఫీవర్ లక్షణాలు ఇవే
గొంతులో నొప్పి మరియు ఆహారం తీసుకొనే సమయంలో అధికంగా గొంతులో నొప్పి, చర్మంపై, మొహం పైన అక్కడక్కడా ఎర్రటి మచ్చలు ఏర్పడడం ఈ ఫీవర్ లక్షణాలని వైద్యులు చెప్తున్నారు. అక్కడ అధికారులు మాట్లాడుతూ కోయంబత్తూర్ కార్పొరేషన్‌లో జ్వరంతో 15 మంది చిన్నారులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇందుకు ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు.కోవై ప్రభుత్వాసుపత్రి అధికారి నిర్మల మాట్లాడుతూ… టమోటా ఫీవర్ లక్షణాలతో ఎవ్వరూ తమ ఆస్పత్రిలో చేరలేదని పేర్కొన్నారు. ఒకవేళ అలాంటి లక్షణాలతో ఎవరైనా వస్తే వారిని చిన్నపిల్లల వార్డులో ఉంచి చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.