మారిన కాలానికి అనుగుణంగా తీసుకునే ఫుడ్ కారణంగా మనుషుల్లో ముఖ్యంగా మగవారిలో చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతుంది. అయితే తమ జుట్టు ఊడిపోయిందని పరువు పోతుంది అని చాలా మంది మగవాళ్లు బాధపడుతుంటారు. ఎగతాళి చేస్తారేమో అని భయపడుతుంటారు. దాని ఎలాగైనా కవర్ చేసుకోవాలి అని రకరకాల మందులు ఆధునిక పద్దతిలో హెయిర్ ట్రాన్సప్లంట్ ఇలా కవర్ చేస్తుంటారు. అయితే ఇక నుంచి ఎవరికైనా బట్టతల ఉండి.. వారిని బట్టతల నీకు ఉంది అని ఎగతాళి చేస్తేపిలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు.. ఇంతే కాకుండా వారిపై లైంగిక వేధింపుల కింద కేసు పెట్టచ్చు.. ఏది మన దేశంలోకాదు ఇంగ్లాండ్ లో సరికొత్తగా అమల్లోకి వచ్చింది.
ఇంగ్లాండ్ లోని వెస్ట్ యార్క్‌షైర్‌లోని బ్రిటిష్ బంగ్ కంపెనీలో వర్క్ చేసే టోనీ ఫిన్ అనే ఉద్యోగిని.. తన పైఅధికారి జేమీ కింగ్.. బట్టతల అంటూ ఎగతాళిగా చేస్తూ మాట్లాడింది. . దీంతో బాధితుడు బాధుపడుతూ . తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై న్యాయస్థానం విచారణ చేసింది. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా జుట్టును కోల్పోతారు కాబట్టి.. పురుషుల బట్టతల గురించి మాట్లాడడం .. స్త్రీలను లైంగికంగా వేధించడంతో సమానమని తెలిపింది. ఫిన్‌ను బట్టతల అంటూ మాట్లాడటం అవమానకరమైన పద్ధతి అని కోర్టు పేర్కొంది. ఇది చుసిన ఇండియన్ నెటిజన్స్ ఇండియా లో కూడా ఇలాంటి రూల్ వస్తే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.