TS CPGET Results 2022: టీఎస్ సీపీజీఈటీ– 2022 ఫలితాలు సెప్టెంబర్ 16న విడుదల కానున్నాయి. ఓయూ (OU)తో పాటు ఇతర వర్సిటీలలో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, 5 ఏళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 11 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షల మూల్యాంకనం చివరి దశలో ఉన్నట్లు కన్వినర్ ప్రొ.పాండురంగారెడ్డి వివరించారు. ఓయూ (Osmania University) నిర్వహించిన CPGET– 2022లో 45 సబ్జెక్టులకు 67,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఓయూతో పాటు తెలంగాణ, తెలంగాణ మహిళ, కాకతీయ, పాలమూరు, శాతా వాహన, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సి టీల్లో పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు స్పష్టంచేశారు. ఇక.. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs