తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపిన టీఆర్ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింంది. టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారనే విషయం చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారాన్ని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తీసుకున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగంలోని దిగనున్నారు. ప్రగతి భవన్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి, ఇవాళ (గురువారం) ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఅర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు. దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తామని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs