ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖలో కర్మయోగి ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కాగా.. సోము వీర్రాజు కూడా హాజరయ్యారు. అయితే ఆయన్ను లోపలికి వెళ్లకుండా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన కిషన్ రెడ్డి ఆయన్ను లోపలికి అనుమతించాలని చెప్పడంతో తిరిగి అనుమతించారు. గేట్ వద్ద ఉన్న సిబ్బంది మీ గురించి తెలియదని అధికారులు సోము వీర్రాజుకు సర్ది చెప్పారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs