16716902607537667714

10 రోజుల్లో 12 మంది తలలు నరికిన సౌదీ సర్కార్

అరబ్‌ దేశాల్లో తప్పు చేసిన వారికి విధించే శిక్షలు కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాదకద్రవ్యాలు, అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగంగా మరణ శిక్షణను అమలు చేస్తారు. తాజాగా సౌదీ అరేబియాలో పది రోజుల వ్యవధిలో 12 మంది నేరస్థులకు బహిరంగంగా శిరచ్ఛేదం శిక్షను అమలు చేశారు. వీరంతా మాదకద్రవ్యాల కేసులో దోషులు.

మరశిక్షణ పడిన వారిలో ముగ్గురు పాకిస్థానీయులు, నలుగురు సిరియా వాసులు, ఇద్దరు జోర్డాన్‌ దేశస్థులు, ముగ్గురు సౌదీకి చెందినవారు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో వివిధ నేరాల్లో దోషులుగా ఉన్న 81 మందికి సౌదీ ప్రభుత్వం మరణశిక్షణను అమలు చేసింది. వీరిలో ఉగ్రవాద సంస్థలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొన్నాయి.

2018లో మరశిక్షణల అమలు గురించి సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మాట్లాడుతూ.. ఇకపై తమ ప్రభుత్వం మరణశిక్షలను వీలైనంత వరకు తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. హత్యలకు పాల్పడిన వారికి మాత్రమే మరణశిక్ష విధిస్తామని తెలిపారు. పాత్రికేయుడు జమాల్‌ ఖషోగ్గీ హత్య తర్వాత సౌదీ ప్రభుత్వం మరణశిక్షణల అమలుపై ఈ విధమైన ప్రకటన చేసింది. గత రెండేళ్లుగా దోషులకు కేవలం ఉరిశిక్షలు మాత్రమే అమలు చేస్తున్న సౌదీ.. ఇప్పుడు మళ్లీ శిరచ్ఛేదం శిక్షను అమలు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తంగా 132 మందికి మరణశిక్షణను అమలు చేసింది. 2020, 2021తో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow