తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. ప్రగతి భవన్ కు వెళ్లిన ఆమె కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 6న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసుల నేపథ్యంలోనే కవిత తన తండ్రిని కలిశారు. నోటీసులపై న్యాయపరంగా, రాజకీయపరంగా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ విషయంపై కవిత ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తోంది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs