తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక పరీక్షలకు సంబంధించి ఆలస్య రుసుంతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు మరోసారి గడువును పొడిగించింది. విద్యార్థులు రూ. 100 ఆలస్య రుసుంతో ఈ నెల 12వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన వారు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కూడా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ సెకండియర్ లో సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు అదనంగా రూ. 210 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రూ.710 చెల్లించాలి.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs