రాష్ట్రంలోని రైతుల అభివృద్ది, సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం పలమనేరు వ్యవసాయ కమిటీతో సమావేశమయ్యారు. రానున్న మామిడి సీజన్ లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సుదీర్ఘ కాలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తరువాత ఆయన మామిడి మండీ నిర్మాణాలను పరిశీలించారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs