16716902607537667714

మంగళవారం రోజున పొరపాటున కూడా ఈ తప్పులను చేయవద్దు..

తెలుగు క్యాలెండర్ లో ప్రతి ఒక్క నెలకు ఒక విశిష్టత ఉంటుంది. జ్యేష్ఠ మాసం అంగారకుడికి చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఈ నెలలో హనుమంతుడిని భక్తితో పూజిస్తే.. ఆశీర్వాదం ఇస్తాడని విశ్వాసం. బలం, తెలివి, జ్ఞానానికి అధిపతి అయిన కుజుడికి మంగళవారం రోజున పూజలు చేసి ఉపవాస దీక్ష ఉన్న భక్తుల పట్ల భగవంతుడిని అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున ఆలయంలో చేసే హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బజరంగబలిని జేష్ఠ మాసం మంగళవారం రోజున పూజిస్తే..  సంకత్మోచనుడు తన భక్తుల కష్టాలన్నింటినీ దూరం చేస్తాడు.మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి నిండుగా ఎర్రటి దుస్తులు ధరించాలి. హనుమంతుడిని ధ్యానించి ఉపవాస దీక్ష చేస్తానని ప్రతిజ్ఞ చేయాలి.  పూజ కోసం ఆలయానికి వెళ్లవచ్చు లేదా ఈశాన్య మూలలో పీఠాన్ని ఏర్పాటు చేసి హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.  బజరంగబలిని ఆరాధించే సమయంలో సింధూరాన్ని పూయాలి. ధూప దీపాలను వెలిగించి ఎరుపు పువ్వులు,  పండ్లను సమర్పించండి. పూజ సమయంలో హనుమంతునికి బూందీ లడ్డూలను నైవేద్యంగా  సమర్పించండి. తమలపాకులు, బెల్లం-పప్పు అందించడం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. బజరంగబలి ముందు హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించండి. అనంతరం ఆరతి నిర్వహించి పూజను ముగించండి.

మంగళవారం రోజున ఉపవాసం దీక్ష చేపట్టి ఆ రోజంతా ఆహారం తీసుకోకండి. ఉపవాస సమయంలో పండ్లు మాత్రమే తీసుకోవాలి. బజరంగబలిని మనస్పూర్తిగా ఆరాధించేవారికి ఆశీస్సులను అందిస్తాడు. రోగాలు, వ్యాధులు కూడా దరి చేరవు. ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే జేష్ఠ మాసం మంగళవారం రోజున  దక్షిణాభిముఖంగా ఉన్న హనుమంతుడిని పూజించడం చాలా ఫలవంతమైనది. ఇలా చేయడం వలన  బజరంగబలికి బలం, తెలివితేటలు , జ్ఞానంతో పాటు మంచి వ్యాపార ఆశీస్సులు లభిస్తాయి.

చేయకూడని తప్పులు 

ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఈ రోజు రుణం ఇచ్చిన వారి డబ్బు తిరిగి రావడం చాలా కష్టం.

ఈ రోజున ఉత్తర దిశ వైపు ప్రయాణించకూడదు. అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రయాణం చేయాల్సి వస్తే బెల్లం తిన్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి.

ఈ రోజున శనీశ్వరుడికి సంబంధించిన బట్టలు ధరించవద్దు. ఎవరితోనూ తప్పుగా మాట్లాడవద్దు. పేదలను వేధించవద్దు.

బడా మంగళ నాడు పొరపాటున కూడా తామసిక ఆహారాన్ని తినకండి. మద్యం, మాంసం, గుడ్డు, ఉల్లిపాయలు,  వెల్లుల్లిని తాకవద్దు. ఇది సమస్యలను కలిగిస్తుంది.

మంగళవారం రోజున ఏ జంతువును ముఖ్యంగా కోతులకు హాని చేయడానికి ప్రయత్నించవద్దు. ఇలా చేయడం భగవంతుని అసంతృప్తికి కారణం అవుతుంది.

20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
advertisement
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow
20240315_112523_0000
20240315_112609_0000
20240315_112642_0000
previous arrow
next arrow