ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం జగన్ శుక్రవారం కంప్యూటర్ లో బటన్ నొక్కి అర్హులైన 3,38,792 మంది మహిళల ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 45-60 ఏళ్ల లోపు వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs