పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు గోవా వెళ్లిన యువకులు పార్టీలో మందు తాగి తీసుకొచ్చారు. స్పష్టమైన సమాచారం అందడంతో SWOT అధికారులు దాడులు నిర్వహించగా పది గ్రాముల డ్రగ్స్‌ని గుర్తించి ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. నగరంలో పెరిగిపోతున్న డ్రగ్స్ సంస్కృతి సనత్ నగర్ కు పాకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారనే సమాచారంతో ఎస్వీటీ రాజేంద్రనగర్ పోలీసులు బుధవారం సనత్ నగర్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను గుర్తించి సీజ్ చేశారు. 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ తో పాటు 5 గ్రాముల గంజాయి, ఓసీబీ ఫ్లేవర్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎండీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.