సంవత్సరంలో పన్నెండు నెలలపాటు.. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న పండు అరటిపండు.. అయితే సింపుల్ గా కనిపించే ఈ పండు రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.. ముఖ్యంగా వేసవి సీజన్లో అరటిపండు తినడం వల్ల అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B6, (Vitamin b6) అనేక ఇతర పోషకాలు అరటిపండులో ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి(heart )health మేలు చేస్తాయి. అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Top Benefits of Banana
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: వేసవిలో ప్రజలు జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అరటిపండును ఈ సీజన్లో తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగుంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా, మీరు అనేక తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. కాబట్టి రోజూ అరటిపండు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
లూజ్ మోషన్లో మేలు చేస్తుంది: ఈ సీజన్లో వేడి కారణంగా ప్రజలు లూజ్ మోషన్‌కు గురవుతారు. ఇలాంటి సందర్భాల్లో అరటిపండు తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు. అరటిపండులో నల్ల ఉప్పు కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది. దీనితో పాటు, అరటిపండుతో పాటు కొంత చక్కెర కలుపుకుని తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది.
రక్తాన్ని పల్చగా ఉంచుతుంది: అరటిపండు శరీరంలో రక్తాన్ని పల్చగా ఉంచడంలో సహాయపడుతుంది. అరటిపండు రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అరటిపండ్లలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గినప్పుడు, రక్త నాళాలలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
మలబద్ధకంలో మేలు చేస్తుంది: అరటిపండు తీసుకోవడం మలబద్ధకం రోగులకు సంజీవని మూలిక లాంటిది. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని కోసం అరటిపండుతో పాలు తాగండి. రోజూ రాత్రి పడుకునే ముందు దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.