న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా 69 ఏళ్ల తర్వాత తొలిసారిగా గురువారం టాటా గూటికి వెళ్లనుంది. నేడు ప్రభుత్వం ఎయిర్ ఇండియాను టాటాలకు అప్పగించింది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం జాతీయ ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించినట్లు సమాచారం. టాటా గ్రూప్ అందరి కంటే రూ.18,000 కోట్లతో బిగించింది. గత ఏడాది అక్టోబర్ 8న ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత టాటా గ్రూపునకు చెందిన టోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రతిపాదనను దాఖలు చేసింది. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌నకు అమ్మేసినట్లు అక్టోబర్8న ప్రకటించిన మూడు రోజుల తర్వాత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది.అక్టోబర్ 25న టాటా గ్రూప్‌తో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (ఎస్పీఏ)ను ప్రభుత్వం కుదుర్చుకుంది.అన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో గురువారం టాటా గ్రూప్‌నకు ఎయిర్ ఇండియాను అప్పచెప్పనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.ఎయిర్ ఇండియాతోపాటు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్,ఎయిర్ ఇండియా ఎస్‌ఏటీఎస్‌లు కూడా టాటాల చేతికి రానున్నాయి. నష్టాలలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ప్రైవేటు రంగానికి అప్పచెప్పాలని చాలా ఏళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది.ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను ప్రైవేటు రంగానికే ప్రభుత్వం ఇచ్చేస్తోంది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs