హిందూపురం లో ఈరోజు అఖిలపక్షం బంద్కు పిలుపునిచ్చింది. హిందూపూర్ అన్ని విధాలుగా ముందుకు పోతున్నదని హిందూపురంను జిల్లా కేంద్రం ప్రకటించాలని బంద్ చేస్తున్నారు. హిందుపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హిందుపూర్ ని జిల్లా కేంద్రంగా చేయాలి అని వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాలలో ముందుకు పోతున్నదని అని ఒక వీడియో రిలీజ్ చేసి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని హిందూపురం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వచ్చే నెల 26 వరుకు ప్రజల అభ్యంతరాలను స్వీకరిస్తాం అంటుంది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs