బాలిక విజయవాడ బెంజి సర్కిల్ వద్ద గల ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. తనను ఓ వ్యక్తి కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని నోట్ బుక్లో రాసిన బాలిక.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది . ప్రధాన నిందితుడిగా చెప్తున టీడీపీ నేత వినోద్ జైన్ ను, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.లోటస్ లోని వినోద్ జైన్ ఇంటికి భవానిపురం పోలీసులు వెళ్లి పరిశీలించారు. అనంతరం దానిని సీజ్ చేశారు. వినోద్ జైన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బాలిక మృతి అనంతరం నిందితుడు వినోద్ ఎవరితో మాట్లాడాడు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు . అతని నివాసంలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు లైంగిక వేధింపులతో పాటు బెదిరించాడా అన్నకోణంలో విచారిస్తున్నారు.బాలిక ఎవరికీ ఫిర్యాదు చేయకుండా నేరుగా చనిపోవడానికి బెదిరింపులే కారణమా.? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. విజయవాడ భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నివాసం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. బాలిక సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వినోద్ పై పోక్సో కేసు నమోదు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ. వినోద్ జైన్ పై చర్యలు తీసుకుంది. అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయితే టీడీపీ నేతల మాత్రం దీని వైస్సార్సీపీ రాజకీయంగా ఈ కేసును వాడుకుంటుంది ఆరోపిస్తున్నారు.