బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ నటి సరయుపై రాజన్న సిరిసిల్ల పోలీస్ లు కేసు నమోదు చేసారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఆమె చేసిన ఒక హోటల్ ప్రచారపాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. హోటల్ ప్రమోషన్ సాంగ్‌లో సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రమోషన్ పాటతో పంపుతున్నారని తెలిపారు.
హిందువుల మనోభావాలను కించపరిచేలా తీసినందుకు తగిన చర్యలు తీసుకోవాలని అశోక్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటన పైన రాజన్న సిరిసిల్ల పోలీస్ లు ఆమె కేసు నమోదు చేసారు.