ఎనిమిదేళ్ల తర్వాత డిజైన్‌ను మార్చేస్తోంది గూగుల్. మనం డైలీ యూజ్ చేసే గూగుల్ క్రోమ్ లోగో ను మార్చ బోతున్నారు. గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విటర్ ఖాతాల్లో ఈ విషయాన్ని తెలియచేసారు. పాత లోగోలో ఉన్నట్టుగా ఇప్పుడు కొత్త బ్రాండ్ ఐకాన్‌లో షాడోలు లేకుండా చేశారు.. అయితే, లోగోలో కినిపించే ఆ పాత నాలుగు రంగులు కాస్త డల్ గ ఉండేవి ఇప్పుడు మెరుస్తున్నాయి.మధ్యలోని నీలిరంగు వృత్తం సైజ్‌ను కొంచెం పెంచారు. గూగుల్ యొక్క ఆధునిక బ్రాండ్ వ్యక్తీకరణకు అనుగుణంగా ఈ మార్పులు చేయబడ్డాయని హు తెలియచేసారు. మరోవైపు విండోస్ సహా వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కోసం ఈ లోగోను తయారు చేసినట్టు హు వెల్లడించారు. డిజైన్ అంటే టోటల్ డిజైన్ మార్చాలి కానీ బ్రైట్నెస్ కొత్త లోగో అనడం ఏంటి డిజైనర్ ను మార్చర్చు కదా అని నెటిజన్స్ ఫన్నీ ట్రోల్ల్స్ వేస్తున్నారు
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs