నిన్న జరిగిన అనంతపురం రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మృతుల పట్ల సంతాపం తెలిపారు. ఆదివారం సాయంత్రం అనంతపురం-బళ్లారి జాతీయ రహదారి విడపనకల్ మండలం కొటాలపల్లి సమీపంలో ఇన్నోవా కారు వస్తోంది. అదే సమయంలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 9 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు మహిళలు, ఒక బాలుడు, ఇద్దరు పురుషులు విగతజీవులుగా మారారు. మృతుల్లో ముగ్గురు బొమ్మనహళ్కు చెందిన వారు కాగా ఉరవకొండ మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నారు
ఈఘటన పైన మోడీ కేంద్ర కార్యాలయం ట్విట్టర్ లో స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం చాలా బాధ కలిగించింది. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు అందజేస్తామని ‘ అన్నారు