ఈరోజు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసారు నిర్మాతలు . మంత్రులు కేటీర్ ,తలసాని శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా రావాల్సి ఉండగా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి తో వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు సితార ఈవెంట్స్ ప్రకటించారు త్వరలోనే ఉంటుంది అని తెలియచేస్తాం అన్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ పేర్కొంటూ మంత్రి మండలిలో కీలక బాధ్యతలు చేస్తూ హఠాత్తుగా గౌతమ్ రెడ్డి మరణించడంతో విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనసు రావట్లేదు అందుకే ఈ ఈవెంట్ ని వాయిదా వేసాం త్వరలో జరుపుతాం అని డేట్ ని నిర్మాతలు తెలియచేస్తారు అంటూ పేర్కొన్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs