ఈరోజు హై కోర్టు తీర్పు పైన చిరంజీవి తమ్ముడు నాగబాబు స్పందించారు. ఈరోజు అమరావతి కి అనుకూలంగా ఇచ్చిన తీర్పు సంచలనం అన్నారు. గత ఎన్నికల ముందు అన్ని పార్టీలతో పాటు వైసీపీ కూడా అమరావతి రాజధానిగా ఒప్పుకుందని అధికారంలోకి వచ్చాక మాట మార్చింది అన్నారు. అమరావతి రాజధానిగా ఉంచాలి అని అమరావతి రైతులు చేస్తున్న ర్యాలీ ని అవమానం పరిచింది అని ఇప్పుడు కోర్టు తీర్పు తో సంతోషంగా ఉంది అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు రాజధానిపై హైకోర్టు తీర్పు ప్రజల్లో ధైర్యాన్ని నింపింది.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, జగన్ రెడ్డి నిరంకుశ పాలన ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది.. అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి అన్నారు పవన్ కల్యాణ్.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs