ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం జిల్లా లో పాము కాటుకు విద్యార్ధి చనిపోవడంతో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కురపాంలోని పంచాయతీ పరిధిలో బీసీ గురుకుల విద్యాలయంలో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటు వేసిన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థులను పాము కాటు వెయ్యగా ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. నిన్న రాత్రి 1 గంటకు పాము కాటువేయడం వెయ్యడం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు . ఆ తర్వాత అక్కడి నుంచి విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మరణించినట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మృతిచెందిన విద్యార్థిని మంతిని రంజిత్గా గుర్తించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వివరాలు అడిగితెలుసుకొని ఆసుపత్రి కి వెళ్లి బాధితులను పరామర్శించారు. చనిపోయిన విద్యార్ధి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది అని తెలిపారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs