తెలంగాణ భీంగల్ : నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలోని పురాని పెట్ దగ్గర నాటుసార విక్రయిస్తున్నారు అనే సమాచారం తో పోలీస్ లు దాడి చెయ్యడానికి పోలీస్ వాహనం లో వెళ్లారు.. ఇందులో ఆబ్కారీ ఎస్సై మరియు కానిస్టేబుల్ ఇద్దరు ఉన్నారు. పురాని పెట్ లో పోలీస్ వాహనాన్ని చూసి కొందరు మద్యం తాగుతున్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. అందులో ఒకడు పోలీస్ లకు దొరికాడు. అతన్ని విచారించడానికి తీసుకొని వెళ్తుండగా మందుబాబులు ఎస్సై మరియు కానిస్టేబుల్ పైన దాడికి పాల్పడ్డారు. ఎస్సై చేతిలో ఉన్న లాఠీని ఎస్సై నే కొట్టారు. ఆబ్కారీ ఎస్సై పిర్యాదు ఆ వ్యక్తుల పైన కేసు నమోదు చేసారు పోలీస్ లు. అయితే కేసు నమోదు వారిని రిమాండ్ కు తరలించలేదు. దాడి చేసిన వ్యక్తులకు రాజకీయ నాయకుల అండ ఉంది అందుకే రిమాండ్ కు తరలించలేదు అంటూ ఆరోపిస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs