పేకాట దాడుల్లో ప్రముఖ నటుడు బాలక్రిష్ణ పీఏ చిక్కడం సంచలనం రేపుతోంది. కర్ణాటక పోలీస్ లు చిక్కబలపురంజిల్లా గౌరీబి దనూరు లోని ఆంధ్ర,కర్ణాటక బోర్డర్ నగిరిగేర వద్ద పేకాట స్థావరంపై పోలీసులదాడులు చేసారు. ఇందులో హిందూపురంకి చెందిన19 మందిరాజకీయ ప్రముఖులు ఉన్నారు. మరికొంత మంది ఉద్యోగులు ఉన్నారు. అందర్నీ అరెస్ట్ చేసారు పోలీసులు. ఇందులో అరెస్టు అయిన వారిలో హిందూపురం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి, ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ కూడా ఉన్నారు. పేకాట ఆడుతున్న వారినుంచి రూ..40 లక్షల నగదు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. బాలయ్య పీఏ బాలాజీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితులను అరెస్ట్ చేసి కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో పోలీసులు హాజరుపరిచినట్లు పోలీసులు తెలియచేసారు.
బాలకృష్ణ పీఏ చెయ్యడంతో హిందుపూర్ లో హాట్ టాపిక్ గా మారింది. పెద్ద నటుడు మరియు ఎమ్మెల్యే పీఏ ఇలా చెయ్యడం పట్ల బాలయ్య కు ఇబంధులు వస్తాయి అంటున్నారు. బాలయ్య ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి బాలాజీ పీఏగా పని చేస్తున్నాడు. అప్పట్లో బాలయ్య పీఏ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. మళ్ళి ఇలా చెయ్యడం బాలయ్య కు తల నొప్పి గా మారింది.