తూర్పు గోదావరి జిల్లా అన్న వారంలో యూనియన్ బ్యాంకు లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు వ్యాపించాయి. బ్యాంకు నుంచి మంటలు వస్తుండంతో స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఇతర సామాగ్రి కాలిపోయింది. అయితే డబ్బులు, పత్రాలు మాత్రం లాకర్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs