వయస్సు పెరిగే కొద్దీ మనిషికి బుద్ది పెరుగుద్ది అంటారు కానీ కొంత మందికి వయస్సు పెరిగే కొద్దీ బుద్ది తగ్గుతుంది. చిన్న వయస్సులో తల్లితండ్రులు బొమ్మలు కొనివ్వలేదు అని ఏడుస్తారు పిల్లలు మరి కొందరు ఏదైనా మంచి మాట చెప్తే విని సైలెంట్ ఐపోతారు. 22వయస్సులో కారు కొనివ్వలేదు అని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు నమ్ముతారా.. అంటే నమ్మాల్సిందే ఎందుకు అంటే నిజంగానే కార్ కొనివ్వలేదు అని ఏకంగా యాసిడ్ తాగి మరి ఆత్మ హత్యా చేసుకున్నాడు. మరింత వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్ల మం డలం కల్లూ ర్ గ్రామానికి చెందిన సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కొడుకులు , ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు భానుప్రకాశ్గౌడ్ అనే వ్యక్తి మాత్రం కొంతకాలంగా కారు కొనివ్వాలని తల్లితండ్రులను కోరుతున్నాడు. గత 15 రోజులుగా మరింత పట్టుబట్టాడు అయినా సరే కుటుంబ సభ్యులు ఏదో సరదా పడుతున్నాడు మాములే అని పాటించుకోలేదు. అతని కోరికను ఇంట్లో ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో భానుప్రకాశ్గౌడ్ చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. శనివారం రాత్రి ఆసిడ్ తాగేసి రోడ్డు పైకి మంటకు తట్టుకోలేక అరుస్తూ రోడ్డుపైకి వచ్చి పరుగులు పెట్టాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రి కి తరలించారు గంటసేపు చికిత్స పొందుతూ మరణించాడు. ఇంతకముందు సెల్ ఫోన్ కొనివ్వలేదు అని గొడవ చేసేవాడు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs