ఏప్రిల్ 2 న జరిగే ఉగాది వేడుకులకు శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని సిద్ధం చేసారు ఆలయ అధికారులు. ఆలయం అన్నివైపులా విద్యుత్ లైట్లతోఆలయాన్ని ముస్తాబు చేసారు. ఉగాది వేడుకల్లో దక్షిణా రాష్ట్రాల నుంచి మహిళలు శ్రీశైల భ్రమరాంబికాదేవికి చీర, సారె సమర్పించేందుకు కర్ణాటక , మహారాష్ట్ర నుంచి భారీగా తరలి రానున్నారు. ఇప్పటికే శ్రీశైలానికి లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. వేల సంఖ్యలో కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు భక్తులు. ఉగాది నాటికీ 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు లేనివిధంగా, శ్రీశైలంలో అన్ని ఏర్పాట్లపై ఆలయ ఈవో ప్రత్యేక పరిశీలిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆహార, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల భక్తుల కమిటీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో జరిగే ఉగాది వేడుకలకు రావాలని ఆహ్వానిస్తున్నారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs