దొంగ ఏదో ఒకరోజు దొరుకుతాడు అంటారు కానీ ఒక దొంగ దొంగతనికి వచ్చి ఎవరు పట్టుకోక పోయిన దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా లో కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఆలయంలో దొంగతనికి కంచిలికి చెందిన ఇసురు పాపారావు అనే వ్యక్తి గుడి కిటికీ విరిచి గుడిలోకి ప్రవేశించాడు అంమ్మవారి నగలు దొంగతనం చేసి బయటికి రావడానికి ప్రయత్నం చేసాడు. కానీ ఏమి పాపం చేసాడో తెలీదు కానీ లోపలకు వెళ్లిన పాపారావు బయటకు రాలేకపోయాడు. అలానే ఇరుక్కు పోయాడు. పొద్దున్న అటు సైడ్ గ్రామస్థలు పాపారావు ఇరుక్కు ఉండడం చూసి గమనించారు. తిలో ఉన్న అమ్మవారి నగలు కింద పడిపోయి ఉండటం కూడా గమనించారు. పాపారావు తనను బయటికి రక్షించాలని ఎంత వేడుకున్నా గ్రామస్థలు ఒప్పుకోలేదు కనికరించక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే లోగా పాపారావు పరిస్ధితిని వీడియోతీశారు . బయటకు తీసి దేహశుధ్ది చేశారు గ్రామస్థులు. తరవాత పోలీస్ లు వచ్చి కేసు నమోదు చేసి జైలు కు తరలించారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs