ఈరోజు నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్స్‌లో జరిగిన జగనన్న వసతి దీవెన పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేస్తూ జగన్ ప్రసంగించారు.జగన్ మాట్లాడుతూ ప్రజల దీవెనలు, దేవుడి దయ ఉన్నంత వరుకు ఇతర పార్టీ లు వ్యతిరేక మీడియా తన వెంట్రుక కూడా పీకలేరని జగన్ అన్నారు. జగనన్న వసతి దీవెన పథకం రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 1,024 కోట్లు జమ చేసారు సీఎం జగన్
ఈ సందర్భం జగన్ మాట్లాడుతూ మా ప్రభుత్వం లో విద్యార్ధులకు స్కూల్స్ లో ఇస్తున్నామన్నారు.ఈ చిక్కి విద్యార్ధుల చేతికి అంటకూడదనే కారణంగా తమ ప్రభుత్వం ఈ చిక్కికి కవర్ చుట్టి కవర్ లో అందిస్తున్న.. .ఆ చిక్కీల పైన జగన్ ఫోటో ఉందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, యెల్లో మీడియా ప్రచారం చేస్తుంది అని మండిపడ్డారు. ప్రజల దీవెనలు, దేవుడి దయ ఉన్నంత వరుకు ఇతర పార్టీ లు వ్యతిరేక మీడియా తన వెంట్రుక కూడా పీకలేరని జగన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పేద ప్రజల కేోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా లో బురద చల్లుతున్నారు అన్నారు
ఎల్లో మీడియా లో రోజుకో కట్టు కథను ప్రచారం చేస్తున్నారన్నారు జగన్ మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా కూడా కట్టుకథలను ప్రచారం చేసి రాష్ట్ర తీస్తున్నారని జగన్ టీడీపీపై విమర్శలు చేసారు. పక్క రాష్ట్రాలలో ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష పార్టీ లు ఉన్నాయి. కానీ రాష్ట్రం పరువును ఏనాడూ పార్లమెంట్ లో తీసే ప్రయత్నాలు ఆ రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీ లు చెయ్యలేదున్నారు.