యువత కు సోషల్ మీడియా ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో అంతే చెడు అలవాట్లను కూడా ఇస్తుంది అనడంలో సందేహం లేదు. సరదాగా పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఒక ప్రాణాన్ని తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొమ్ముగూడకు గ్రామానికి చెందిన ఒక యువతి హైదరాబాద్ లో పాలిటెక్నిక్ చదువుతోంది. తెలుగు వారి పండుగ ఉగాది కావడంతో సెలవులో స్వగ్రామానికి వచ్చి గ్రామంలోనే ఉంటోంది. ఊర్లో స్థానిక యువకుడు అజయ్ అనే వ్యక్తి యువతితో సరదాగా సెల్ఫీ ఫొటోస్ తీసుకొని ఆ ఫోటోలను వాట్సాప్ స్టేటలో పెట్టాడు. స్టేటస్ లో పెట్టిన ఫోటోలను తొలగించాలని యువతి తల్లిదండ్రులు కోరినా అజయ్ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందుతాగి ఇంట్లో నే ఆత్మహత్యకు చేసుకుంది.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs