బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభించిన సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం జలభద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడ ఆదిత్య బిర్లా గ్రూపు రూ.2,700 కోట్ల పైగా భారీ పెట్టుబడితో ఈ కాస్టిక్ సోడా ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా జిల్లాలో ఉన్న స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. ఇందులో 75 శాతం స్థానికులకె ఉపాధి అవకాశం కల్పిస్తాం అని గ్రాసిమ్ పరిశ్రమ ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఆధునిక సాంకేతికతతో ఎటువంటి భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా పరిశ్రమను ఏర్పాటు చేశారు నిపుణులు. ఆదిత్య బిర్లా గ్రూప్ అధ్యక్షుడు కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ .. సీఎం జగన్ గారి విజన్ మరియు డైనమిక్ లీడర్ షిప్ వల్లనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎంపీ లు ఎమ్మెల్యే లు పాల్గొనున్నారు.