ప్రపంచ దేశాలను కరోనా మరో సారి కలవర పెడుతుంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులని, సెలెబ్రెటీస్ ని సైతం వదలట్లేదు. తాజాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు కరోనా సోకింది. నిన్న కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. అధికారులు తెలియాచేస్తూ ర్యాపిడ్, పిసిఆర్ పరీక్షలలో పాజిటివ్ వచ్చిందని కానీ కమలా హారిస్‌కు ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు. దీంతో హారిస్ తన నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు అని చెప్పారు. సీడీసీ.. వైద్యుల బృందం ఆమెను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పారు. అమెరికా ప్రెసిండేట్ తర్వాత అత్యున్నత పదవి కావడంలో హరీష్ కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. కమలా హారిస్ వయస్సు 57 ఏళ్ల ఇప్పటికే కోవిడ్-19 వ్యాక్సిన్ పలుమార్లు తీసుకున్నారు. ఇటీవల బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు అని అధికారులు తెలిపారు. వయస్సు ఎక్కవు ఉండడంతో ఇప్పటివరకు మొత్తం నాలుగు డోసుల టీకా తీసుకున్నారు. త్వరలోనే కోలుకుంటారు అని అధికారులు తెలియచేసారు.
Copyright @2023 All Right Reserved – Designed and Developed by The Mass Designs