తనపై డైరెక్టర్లు చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్(శాప్) ఎండీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బోర్డు సభ్యులను సైతం ఎండీ పట్టించుకోవడం లేదని శాప్ డైరెక్టర్లు కాలువ నర్సింహులు, డేనియల్, వరలక్ష్మి, భీమిరెడ్డి నాగేంద్ర ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.
తనపై డైరెక్టర్లు చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్(శాప్) ఎండీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బోర్డు సభ్యులను సైతం ఎండీ పట్టించుకోవడం లేదని శాప్ డైరెక్టర్లు కాలువ నర్సింహులు, డేనియల్, వరలక్ష్మి, భీమిరెడ్డి నాగేంద్ర ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. స్పోర్ట్స్ కోచ్ ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.MD ప్రభాకర్ రెడ్డి బోర్డు సభ్యుల నిర్ణయాలను పట్టించుకోవడం లేదంటు ఆరోపించారు. రూ.5 కోట్లు నిధులు ఉన్నా..సీఎం చెప్పినా ఏమీ అభివృద్ధి చేయడం లేదని..టెండర్లలోనూ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు.కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగిస్తున్నారంటూ ఆరోపించారు. అర్హత లేనివారికి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ లు ఇచ్చారని..కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఎక్కువ రేటుకు టెండర్లు అప్పగిస్తున్నారని ఆరోపించారు
తనపై వచ్చిన ఆరోపణలపై శాప్ ఎండి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. శాప్ లో యేడాదిన్నర కాలంగా మంచి కార్యకలాపాలు నిర్వహించామని..గతంతో పోలిస్తే నాలుగు రెట్లు క్రీడాకారులు పెరిగారని క్రీడాకారుల్ని పట్టించుకోవట్లేదని ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తెలిపారు. శాప్ అభివృద్ధి గురించి ఆలోచించి శాప్ కు సొంత ఆదాయం పెంచుకునేలా తొలి అడుగులు వేశామని తెలిపారు.1350 క్యాంపులు జరగ్గా 42వేల మందికి శిక్షణ ఇచ్చామని..జగనన్న క్రీడా సంబరాలు, ఘనంగా నిర్వహించామని తెలిపారు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తేదీల ప్రకారం జనవరిలో సీఎం కప్ జరగాల్సి ఉందని..నేను విదేశీ పర్యటన వెళ్లిన సమయంలో కొంతమంది నాపై లేనిపోని పుకార్లు ప్రచారం చేశారంటూ చెప్పుకొచ్చారు.వారు చేసే ఆరోపణలు అవాస్తవాలని..ఆధారాలు, ఫిర్యాదు లేకుండా ప్రచారం చేశారన్నారు.నేను అవినీతికి పాల్పడినట్లుగానీ విధుల్లో నిర్లక్ష్యం చేసినట్లుగా ఎటువంటి ఆధారాలు ఉన్నా … నా పైవారికి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. నామీద అసత్యాలు ప్రచారం చేసే వారి పై న్యాయ పోరాటం చేస్తామని..సిఎం కప్ ప్రభుత్వం ఇచ్చే తేదీలను బట్టి టోర్నమెంట్ నిర్వహిస్తాంమని తెలిపారు.ప్రభుత్వం నుంచి కూడా నిధులకు అనుమతి రావాల్సి ఉందని అది అర్థం చేసుకోకుండా అవగాహన లేకుండా కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎండీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.స్పోర్ట్స్ కోటా కు సంబంధించిన జాబితా కూడా ఓపెన్ గా పెట్టి ఎంపిక చేశామని దీంట్లో ఎటువంటి అక్రమాలు..అర్హత కలిగిన క్రీడాకారులకు ఎటువంటి అన్యాయం జరగలేదన్నారు.ఫిజికల్ టెస్ట్ లోపాల్గొనకుండా కొంతమంది క్రీడాకారులు వెళ్లిపోతున్నారని..అన్నీ పరిశీలించాకే మేము క్రీడాకారులను ఎంపిక చేస్తున్నాంమన్నారు. పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా మేము పని చేస్తున్నామని అటువంటి నాపై ఇటువంటి ఆరోపణలు చేయటం సరికాదన్నారు.
ఈ టెండర్ ప్రాసెస్ లో క్రీడా పరికరాలు కొనుగోలు జరుగుతుందని..కమిటిల్లో కూడా క్రీడా కోచ్ లను నియమించామనీ తెలిపారు.బోర్డు సమావేశం లో ఎటువంటి సందేహం ఉన్నా అడగొచ్చు ..అంతేతప్ప నిరాధారమైన ఆరోపణలు చేయడం డైరెక్టర్ లకు సరి కాదని సూచించారు.ఈరోజు బోర్డు సమావేశంలో కూడా అనేక అంశాలు చర్చించామని..అధికారులు కూడా నిబంధనల ప్రకారం నడుచు కోవాల్సి ఉందన్నారు.పీఆర్సీ అనేది పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని..గత సమావేశంలో బోర్డులో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. శాప్ కార్యాలయం మొత్తం సిసి కెమెరా పర్యవేక్షణలో ఉంది..నా మీద ఆరోపణలు చేసే వారు ఆధారాలు చూపితే సమాధానం చెబుతానని స్పష్టంచేశారు.పూర్తి పారదర్శకంగా, ప్రశ్నించే విధంగా వ్యవస్థను అమలు చేస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం పని చేయమంటే కొంతమందికి బాధ కలుగుతుంది..ఎక్కడో ఒక స్టేడియంలో బాత్రూమ్ బాగోపోతే..అదికూడా శాప్ ఎండిదే బాధ్యత అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.ఏ నిర్ణయం తీసుకున్నా బోర్డులో చర్చించాకే అమలు చేస్తామని..కానీ డైరెక్టర్లు మాత్రం బోర్డులో ఎత్తాల్సిన అంశాలను మీడియా ముందు చెప్పారంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారని అర్ధమవుతోందని చెప్పుకొచ్చారు శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి.